వసుధారతో పెళ్ళికి ఒప్పుకున్న రిషి.. శైలేంద్ర తప్పించుకుంటాడా?
on Oct 1, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -882 లో.. జగతిని రిషి అమ్మ అని పిలవగానే జగతి మురిసిపోతుంది. నువ్వు ఇలా అమ్మ అని పిలుస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందని జగతి చెప్తుంది. ఇన్ని రోజులు నా ముర్ఖత్వంతో చాలా బాధపెట్టాను అమ్మ అని రిషి పశ్చాత్తాపంతో మాట్లాడతాడు.
నిన్ను ఒక అమ్మలా కాకున్నా ఒక మనిషిగా కూడా చూడలేదు. నీ ప్రేమని చులకన చేశాను. నన్ను క్షమించు అని జగతితో చెప్తూ రిషి బాధపడతాడు. నీ ప్రేమని త్యాగాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖుడిని అని రిషి అంటాడు. నిన్ను ఎంత ద్వేషించిన నీ ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను కాపాడవని రిషి అంటాడు. అది నీ తప్పు కాదు. ఇప్పుడు నువ్వు ఎలా నన్ను దూరం పెట్టావో, నేను అప్పుడు నిన్ను దూరం పెట్టాల్సి వచ్చిందని.. రిషిని చిన్నప్పుడు ఎందుకు దూరం పెట్టాల్సి వచ్చిందో జగతి చెప్తుంది. నా కుటుంబానికి కష్టం వస్తే నేను వెళ్లే పరిస్థితి వచ్చింది. అప్పుడు నా కన్నవాళ్ళకి ఒక సమస్య వచ్చింది. ఇక్కడ నీకోసం ఇంతమంది ఉన్నారు కానీ నా కుటుంబానికి నేనే ఉన్నాను అందుకే నేను వెళ్ళాను. నీకు కన్న ప్రేమని దూరం చేశానని జగతి ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత అలా అనకు జగతి అప్పటి సిచువేషన్ లో అలా జరిగిందంటూ మహేంద్ర అంటాడు. నేను నిన్ను వదిలిపెట్టలేదు రిషి వదిలి పోవాలిసి వచ్చిందని జగతి చెప్తుంది. నువ్వు నన్ను ఎంత మిస్ అయ్యావో నేను అంతే మిస్ అయ్యాను. నువ్వు కన్పించిన ప్రతిసారీ అమ్మ అని పిలవాలని అనిపించేది.. కానీ మూర్ఖున్ని తెలుసుకోలేకపోయాను. కానీ ఇప్పుడు నీకోసం ఏం చేయమన్న, ఇప్పుడు నీ కోసం ఏమైనా చేస్తానంటు జగతి చేతిలో చేయ్ వేసి రిషి మాటిస్తాడు .అప్పుడు జగతి తన బ్యాగ్ లో ఉన్న బాక్స్ ని వసుధారని ఇవ్వమంటుంది.. ఆ బాక్స్ లో వసుధార తాళి ఉంటుంది. ఈ తాళి వసుధార మెడలో కట్టు రిషి, మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి అది నా కోరిక అని జగతి చెప్తుంది.
ఆ తర్వాత రిషి కాసేపటికి జగతి కోరికని ఒప్పుకుంటాడు. దాంతో జగతి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మని కాసేపు రెస్ట్ తీసుకొనివ్వని మహేంద్ర అనగానే.. అందరు అక్కడ నుండి వెళ్ళిపోతారు. మరొకవైపు శైలేంద్ర రౌడీకీ డబ్బులు ఇస్తానని వెళ్లి.. నేను చేసిన పనులకు సాక్ష్యం ఉండద్దని రౌడీని శైలేంద్ర గన్ తో షూట్ చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



